బాత్రూమ్ లో విగతజీవిగా బాలీవుడ్ నటుడు ఆదిత్య

  • ముంబైలోని అపార్ట్ మెంట్ లో ఆదిత్య మృతి
  • ఆయన వయసు 32 సంవత్సరాలు
  • ఆదిత్య కుప్పకూలిపోయిన విషయాన్ని గుర్తించిన పనిమనిషి
బాలీవుడ్ లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువనటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్ పుత్ ముంబై అంధేరీలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించాడు. ఆయన వయసు 32 సంవత్సరాలు. ఆదిత్య మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించినట్టు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

పోలీసుల వివరాల ప్రకారం... గత రెండు రోజులుగా ఆదిత్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. నిన్న మధ్యాహ్నం తన అపార్ట్ మెంట్ లోని బాత్రూమ్ లో ఆయన కుప్పకూలిపోయాడు. ఆయన ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే బిల్డింగ్ సెక్యూరిటీకి సమాచారం అందించింది. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా... అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజ్ పుత్ మృతిపై అనుమానించదగ్గ విషయాలు తమకు కనపించడం లేదని ఒక పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు రిజిస్టర్ చేశామని చెప్పారు.

Aditya Singh
Bollywood

More Telugu News